మంగళగిరిలో నైపుణ్య గణన సర్వే

బెంజ్ న్యూస్ .యువతలో నైపుణ్యాలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ . నిర్దేశిత సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆన్ లైన్ విధానంలో స్కిల్ సెన్సస్ వివరాలు సేకరిస్తారు. స్కిల్ సెన్సెస్ లో భాగంగా వివరాలను సేకరించి, వారిలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, తద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం తొలుత మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దీనిని చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ సూచిన.