తెలుగు నేలపై జరిగిన తంగలాన్ పోరాటం ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం.

స్వేచ్ఛ, సమానత్వం ఆత్మ గౌరవం సాగిన పోరాటం తంగలాన్ సినిమా కథ. ఈ సినిమా గురించి, సోషల్ మీడియా లో చాలా మంది రివ్వూ లు రాస్తూ , చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉంది. అదే స్వేచ్ఛ, సమానత్వం ఆత్మ గౌరవం కోసం ముప్పై ఏళ్ళుగా చేస్తున్న పోరాటం ఎమ్మార్పిఎస్ వర్గీకరణ ఉద్యమం. మొత్తానికి ఎన్నో త్యాగాలు గాయాలు భుజాల మీద మోస్తూ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వర్గీకరణ ఉద్యమం విజయం సాధించింది. మరి ఈ సమమాజ ఉద్దారకులు , బుద్దిజాన్ని భుజాల మీద మోస్తాం అని చెబుతున్న చాలామంది. వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ను స్వాగతించక పోగా సోషల్ మీడియా లో విషం చిమ్మటానికి పూనుకున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏమంటే మాదిగ యువకులు జాగ్రత్తగా ఉండండి. రకరకాల ఇజాలతో మీ వేళ్ళతోనే మీ కళ్ళు పొడుచుకునే పరిస్థితి తీసుకుని వస్తారు. వందలాది కులాల హక్కుల పోరాటం ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లు వర్గీకరణ పోరాటం . ఇలాంటి మహోన్నత మానవీయ ఉద్యమాన్ని దళితులు అందరూ కలిసి, తమలో అడుగున పడిన కులాలకు హక్కులు సాధించేందుకు ఉద్యమం చేయాలి. చేయక పోగా , అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఇదంతా అంబేద్కర్ పూలే వాదుల అని చెప్పుకుంటూ, సంఘాలు పెట్టిన వారే చేయడం ఇంకా దుర్మార్గం. జై అంబేద్కర్ జై పూలే జై బాబూ జగ్జీవన్ రామ్ జై మంద కృష్ణ మాదిగ #చిరుగురి నాగరాజు మాదిగ, పల్నాడు జిల్లా, ఎమ్మార్పీఎస్, నరసరావుపేట నియోజకవర్గం ఇన్చార్జి,