రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్.

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ప్రారంభం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కానున్న డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం. మండలానికి ఇద్దరు చొప్పున నియోజకవర్గంలో 10 మంది ప్రజా సేవక్ ల నియామకం. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయనున్న ప్రజా సేవక్ లు.
రోజుకో మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ప్రజా సమస్యలు పరిష్కరిస్తానంటున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్.