మంగళగిరి మున్సిపల్ హైస్కూలులో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ
August 15, 2024
బెంజ్ న్యూస్.తిరువీధుల సతీష్ సహకారంతో పంపిణీ చేసిన టీడీపీ నాయకులు
మంగళగిరి టౌన్, ఆగస్టు 15: స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ, ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ స్ఫూర్తితో ....మంగళగిరి పట్టణం 20వ వార్డులో ఉన్నటువంటి మున్సిపల్ హైస్కూలులో తెలుగుయువత నాయకులు తిరువీధుల సతీష్ సహకారంతో విద్యార్థులకు టీడీపీ నాయకులు పెన్నులు, పెన్సీళ్లు, పరీక్ష ప్యాడ్స్, స్కేల్స్ పంపిణీ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానకీదేవి మాట్లాడుతూ భవితకు బాట విద్యార్థి దశనుండే ప్రారంభమవుతుందని అన్నారు. ఎందరో మహాత్ములు బడి ఆవరణలోనే విద్యార్థి దశ నుండే ఉద్భవించారన్నారు. ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామర్ల రాజు, ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, మాజీ కౌన్సిలర్ బట్టు చిదానంద శాస్త్రి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పడవల మహేష్,పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు వాకా మాధవరావు, పద్మశాలి సాధికార సమితి సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ, జంజన వెంకట సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మున్నంగి శివ శేషయ్య, కారంపూడి అంకమ్మరావు, గుంటి నాగరాజు,చెల్లూరి వీర వెంకట సత్యనారాయణ, దామర్ల బిక్షారావ్, వింజమూరు చంద్రశేఖర, బిట్ర నాగరాజు, దుర్గా కోటి నాయక్, స్కూల్ విద్యా కమిటీ చైర్పర్స తాడేపల్లి ఆషికా, స్కూల్ హెడ్మాస్టర్ జాన్ బాషా , షేక్ మొహమ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

