జూలై 24 జాషువా 53 వ, వర్థంతి...
( బెంజ్ న్యూస్ ) :
(మీడియా & దినపత్రిక )
ప్రత్యేక కథనం :
ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971)సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగిసామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడుబ్రాహ్మణులు కుట్రలతో సృష్టించిన తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించిఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువాఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు
జాషువా 1895, సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారుతల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు తండ్రి యాదవ, తల్లి మాదిగ, ఈ ఒక్క విషయం చాలు, మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికిబాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగిందిచదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు
మొదలయ్యాయిఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు
అయితే జాషువా ఊరుకొనేవాడు కాదుతిరగబడేవాడు అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే,తిరగబడి వాళ్ళను కొట్టాడు1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడుమిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడుఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసాడు టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పనితరువాత గుంటూరులోని లూథరన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేసాడుతరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసాడురెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసాడు1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసాడుఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడుతక్కువ కులం వాడిని సభ లోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారుఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చు మాత్రమే అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండీ, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారుఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారుక్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు
జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది1971 జూలై 24న గుంటూరులో శ్రీ గుర్రం జాషువాగారు పరమపదించారు