జాతి బిడ్డ, రాష్ట్ర హోం మంత్రి.. జాతి పితకు పాదాభివందనం చేసింది..

వంగలపూడి అనిత అక్కకు హ్యాట్సఫ్..
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే తత్వం....






మాదిగ ముద్దుబిడ్డ, ఫైటర్, తన వాగ్ధాటితో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంలా నిలిచిన నాయకురాలు అనిత అక్క..

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపుడి అనిత గారిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గారు విజయవాడలో అభినందించారు. శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా హోం శాఖ మంత్రి వంగలపుడి అనిత గారు మాదిగ జాతిపిత మంద కృష్ణ మాదిగ గారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.

అనిత అక్క గొప్ప వ్యక్తిత్వానికి ఈ సంఘటన నిదర్శనం. గొప్ప రాజకీయ పరిణితికో నిదర్శనం.

మాదిగ రాజకీయ నాయకులు అనిత అక్క నుండి స్పూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాజకీయాలలో పదవులు రాగానే మాదిగ ప్రజాప్రతినిధులు వారి అధినేతలను సంతృప్తి పరచడానికి తమ జాతి మాతృ సంస్థ ఎమ్మార్పీఎస్ మీద విమర్శలు చేయడం, ఉద్యమ అధినేత మందకృష్ణ మాదిగ గారిపై మాట్లాడం ఇంతవరకు జరుగుతూ వచ్చాయి.

ఇలాంటి కార్యక్రమాలు మానుకొని జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాదిగ రాజకీయ వేత్తలు ఎమ్మార్పీఎస్ తో ముందుకు సాగాలని కోరుతున్నాం.


మంద కృష్ణ మాదిగ గారు విశాల సామాజిక మానవీయ దృక్పథం ఉన్న నాయకుడు.తన జాతి బిడ్డలు ఎక్కడ ఉన్న అత్యున్నత స్థాయిలో ఉండాలని కోరుకునే నాయకుడు. అందుకు తన శక్తి మేరకే కావల్సినంత సహాయ సహకారాలు అందించే నాయకుడు.

తనపై విమర్శలు చేసిన,దూషించిన, నిందలు మోపిన, చివరికి అవమానించిన కూడా నా జాతి బిడ్డలే కదా అని ఏనాడు ఏ మాదిగ నాయకుడిని తిరిగి ఒక మాట కూడా అనలేదు..

ఇన్ని చేసి మళ్ళీ తన వద్దకు వస్తే చిరునవ్వుతో పలకరించి అక్కున చేర్చుకునే గొప్ప మనసున్న నాయకుడు మంద కృష్ణ మాదిగ గారు...

ఇది ఈ నాటి మాదిగ తరం అర్థం చేసుకోవాలి.

ఈ తరం మాదిగ రాజకీయ నాయకులైనా  పాత వారి వలే కాకుండా జాతి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని వుద్యమన్ని గౌరవిస్తూ నూతన విధానాలతో ముందుకు సాగుతారని ఆశిస్తున్నాం.

ఈ క్రమంలో హోం శాఖ మంత్రి అనిత అక్క ప్రవర్తించిన తీరు, ఇచ్చిన గౌరవం, చూపెట్టిన ఆత్మీయత, స్పూర్తి దాయకం...

చిరుగురి నాగరాజు మాదిగ*
పల్నాడు జిల్లా,MRPS నరసరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి,