దుషారా విజయన్ కి పెరుగుతున్న క్రేజ్!

'వేట్టయన్'లో దుషారా ఓ సాధారణమైన స్కూల్ టీచర్ పాత్రను పోషించింది. ఇందులో అన్యాయాన్ని .. అవినీతిని ధైర్యంగా నిలదీసే పాత్రలో ఆమె కనిపిస్తుంది. ఈ కథకు ఈ పాత్రనే కీలకం. కథ అంతా కూడా ఆమె పాత్రను ఆధారంగా చేసుకునే నడుస్తుంది. అలాంటి ఈ సినిమాలో ఆమె నటనకి ప్రశంసలు దక్కాయి. దాంతో ఇప్పుడు ఆమె డిమాండ్ పెరిగిపోయిందని టాక్. విక్రమ్ సినిమా 'వీర ధీర శూరన్' తో పాటు, మరికొన్ని ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. మొత్తానికి దుషారా దూకుడు పెరిగినట్టేనని చెప్పుకోవాలి.