కేజీఎఫ్ నిర్మాత అందిస్తున్న మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బఘీర'
October 15, 2024
బఘీరకు కథ అందించిన ప్రశాంత్‌నీల్
థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బఘీర
అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు బఘీర
కేజీఎఫ్, సలార్ లాంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించిన మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బఘీర', ఉగ్రమ్ ఫేమ్ శ్రీమురళి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ అందించడం విశేషం. డాక్టర్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 31న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రుధిర హరను ఈ నెల 17న విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం థ్రిలింగ్ యాక్షన్ ఏపిసోడ్స్‌తో, ఆకట్టుకునే విజువల్స్‌తో వుండబోతుందని, హీరో శ్రీమురళి పాత్ర ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురిచేసే విధంగా ఉంటుందని అంటున్నారు నిర్మాత. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏపియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ తెలుగులో విడుదల చేస్తుంది. రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎజె శెట్టి డీవోపీ కాగా, కాంతార ఫేమ్ బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.