బీసీ కుల జనగణన మహాధర్నా విజయవంతం చేయాలని
October 03, 2024
కోరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్ రావు.
బీసీ కుల జనగణన చేయాలని ఈ నెల 9వ తేదీన విజయవాడ లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నా విజయవంతం చేయాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్ రావు కోరారు. ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ బీసీ లకు రాజ్యాధికారం దక్కాలాన్నా, పదవులు పొందాలి అన్నా, బీసీ బిడ్డలకు విద్య, ఉపాధి పరంగా రిజర్వేషన్ లు పొందాలన్నా కుల జనగణన ఏకైక మార్గం అని ఆయన తెలిపారు. కావున ఈనెల 9వ తేది జరగుతున్న మహాధర్నా విజయవంతం చేయాలి అని తధ్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశం లో మహాధర్నా గోడ పత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరగాని ఏడుకొండలు, జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు,బి ఎస్ పి నాయకులు చీరతానగండ్ల వాసు,బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు, కోలా అశోక్ తదితరులు పాల్గొన్నారు.