పుష్ప-2 న్యూ అప్‌డేట్‌.. అల్లు అర్జున్‌ మాసివ్‌ లుక్‌తో న్యూపోస్టర్‌

పుష్ప-2 నుంచి 50 రోజలు కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ విడుదల మాసివ్ లుక్‌తో న్యూ పోస్టర్‌ విడుదల డిసెంబరు 6న చిత్రం విడుదలను మరోసారి కన్‌ఫర్మ్‌ చేసిన మేకర్స్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం పుష్ప-2 దిరూల్‌. ఇంతకు ముందు ఇదే కాంబినేషన్‌లో వచ్చిన విజయవంతమైన చిత్రం 'పుష్ప'కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ వ్యయంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు మేకర్స్. డిసెంబరు 6న పుష్ప దిరూల్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఈ చిత్రం లేటెస్ట్‌ అప్‌డేట్‌ కోసం, కొత్త ప్రచారం చిత్రం కోసం వెయిట్‌ చేస్తున్న అల్లు అర్జున్‌ అభిమానుల కోసం మేకర్స్‌ తాజాగా ఓ అప్‌డేట్‌ను వదిలారు. మరో 50 రోజుల్లో థియేటర్లో పుష్పరాజ్‌ రూల్‌ ప్రారంభం.. అంటూ ఓ మాసివ్ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్‌ ఎగ్రెసివ్‌ మాసివ్‌ లుక్‌తో..డాన్‌లా కూర్చొని వున్న ఓ న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నపుష్ప ది రూల్‌ చిత్రం ఇప్పటికే వెయ్యి కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ పూర్తిచేసుకుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీత సారథ్యంలో రూపొందిన రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు. ఆ లిరికల్ వీడియోలకు అనూహ్యమైన స్పంద వచ్చింది. బ్యాలెన్స్‌గా వున్న రెండు పాటలను నవంబరులో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో పాటు పుష్ప-2 ప్రమోషనల్‌ ప్లాన్‌ కూడా నిర్మాతలు రెడీ చేశారని, త్వరలోనే పుష్ప-2 అగ్రెసివ్‌ ప్రమోషన్స్ మొదలుపెడతారని సమాచారం.