రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ తీర్పును వెంటనే ఉపసంహరించుకోవాలి
August 21, 2024
బెంజ్ న్యూస్ .కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద వ్యతిరేక విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది గుర్రం రామారావ
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని దేశవ్యాప్తంగా భారత్ బందులో భాగంగా మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది, గుర్రం రామారావు ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులను ఆపివేసి మాలల పంతం వర్గీకరణ ఆపివేస్తాం అనే నినాదాలతో బస్సులను బస్టాండ్ ఆవరణలో నిలిపివేసి, అలాగే గౌతమ బుద్ధా రోడ్డు వెంబడి వెళ్తున్న కాలేజీ బస్సులను సైతం నిలిపివేసి, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ రాజ్యాంగ విరుద్ధమని, కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం విభేదాలు సృష్టించడానికి ఎస్సీ వర్గీకరణ తీసుకువచ్చారని వర్గీకరణ ఆపేంతవరకు తాము ఉద్యమిస్తూ ఉంటామని, అదేవిధంగా పట్టణంలోని స్కూల్స్, కాలేజీలు కూడా నిర్వహించకూడదని అన్ని స్కూల్స్ కి కాలేజీలకి మంగళవారం నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కులాల మధ్య విభేదాల సృష్టించడం మానుకోవాలని లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గుర్రం రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.