జ్ఞాపకాలను భావితరాలకు అందించేది చాయాచిత్రాలే.....
August 19, 2024
బెంజ్ న్యూస్.ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రెడ్డి శివనాగిరెడ్డి....
జ్ఞాపకాలను భావిత రాలకు అందించేది చాయా చిత్రాలేనని గుంటూరు జిల్లా మంగళగిరి ఫోటో, వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రెడ్డి శివ నాగిరెడ్డి చెప్పారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని చిన్న కాకాని షైన్ అనాధ శరణాలయం నందు ఆసోసియేషన్ ఆధ్వర్యంలో 80 మంది అనాధ పిల్లలకు అన్నదానం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అసోసి యేషన్ సభ్యులంతా పిల్లలకు అన్నదానం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నందం వీరాంజనేయులు (బుజ్జి), గోలి వెంకట శివ కుమార్ మరియు గౌరవ సలహాదారులు పడాల అమర్నాథ్ సీనియర్ ఫోటోగ్రాఫర్ జంజనం వీర్లు,అధ్యక్షులు మర్రెడ్డి శివ నాగిరెడ్డి ఉపాధ్యక్షులు పడాల అనిల్ కుమార్ కార్యదర్శి కొండా.అభిరామ్ కృష్ణారెడ్డి సహాయ కార్యదర్శి కన్య కుమార్ (కెకె) కోశాధికారి పల్లి ప్రకాష్ బాబు, శ్యామ్ తదితరు ఫోటోగ్రాఫర్స్ వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు...