లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు: ఎస్సై వేణుగోపాల్

రాజుపాలెం,( బె
ంజ్ న్యూస్): రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని రాజుపాలెం ఎస్సై వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బెంజ్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ డ్రైవింగ్ అనుభవం లేకుండా వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా పొంది ఉండాలని అన్నారు. అదేవిధంగా మైనర్ యువత వాహనాలు నడపటం ప్రభుత్వ నీబంధనలుకు విరుద్ధమని అట్టి వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని అన్నారు. వాహనదారులు వాహన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా పొంది ఉండాలని సూచించారు. ఆటో ,జీబు టాటా మ్యాజిక్ , సంబంధిత వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రయాణిస్తే అట్టి వాహనాలపై కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. ప్రజారక్షణలో భాగంగా మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంబంధిత గ్రామాల్లో రాత్రి సమయంలో ఉన్నతాధికారుల అనుమతి మేరకు పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.