సీకే గరల్స్ హైస్కూల్ కు సురక్షిత తాగునీటి ప్లాంట్
August 21, 2024
బెంజ్ న్యూస్ .రూ.2.50 లక్షలతో సమకూర్చిన మంగళగిరి రోటరీ క్లబ్
ఆర్ఐడీ 3150 గవర్నర్ నామినీ ఉదయ్ పిలాని చే ప్రారంభోత్సవం
రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారికి ధన్యవాదాలు తెలిపిన సి కె బాలికల హైస్కూల్ యాజమాన్యం.
మంగళగిరి సీకే గరల్స్ హైస్కూల్ లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినుల కోసం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో సురక్షిత తాగునీటి ప్లాంట్ ను రూ.2.50 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేశారు. సీకే ఉన్నత పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయినుల అభ్యర్థన మేరకు మంగళగిరి రోటరీ క్లబ్ ఈ సర్వీసు ప్రాజెక్టును అనతి కాలంలోనే చేపట్టింది.ఈ మేరకు బుధవారం ఉదయం రోటరీ ఇంటర్నేనేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ నామినీ (2026-27) ఉదయ్ పిలాని ముఖ్యఅతిథిగా విచ్చేసి వాటర్ ప్లాంట్ ను ప్రారంభోత్సవం చేశారు.అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథి ఉదయ్ పిలాని మాట్లాడుతూ మంగళగిరి రోటరీ క్లబ్ అనతికాలంలోనే స్ఫూర్తిదాయక సర్వీసు ప్రాజెక్టులను చేపడుతుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. సీకే విద్యాసంస్థల యాజమాన్యం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 తరపున మరిన్ని సర్వీసు ప్రాజెక్టులు చేపడతామని భరోసాఇచ్చారు.పీడీజీ అన్నె రత్నప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థినులు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆ పరిస్థితుల్లో చదువు కూడా ఆహ్లాదకరంగా సాగుతుందన్నారు.అనిల్ చక్రవర్తి మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ 119 సంవత్సరాలుగా సేవలందిస్తోందని, 200 దేశాల్లో పనిచేస్తోందని విద్యార్థినులకు వివరించారు.మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, సీకే గరల్స్ హైస్కూల్ విద్యార్థినులకు సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో స్వల్పకాలంలోనే వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేశామని చెబుతూ, భవిష్యత్తులో మరిన్ని సర్వీసు ప్రాజెక్టులు చేపడతామని వివరించారు.సీకే గరల్స్ హైస్కూల్ ప్రెసిడెంట్ కల్యాణ్ కుమార్, ఇన్ చార్జి హెచ్ఎం తనూజ మాట్లాడుతూ తాము అడిగిందే తడువుగా మంగళగిరి రోటరీ క్లబ్ ముందుకు వచ్చి సురక్షిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిందని. పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించేందుకు ఇటీవలే 90 మొక్కలు నాటడం జరిగిందని ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సెలర్ పీడీజీ అన్నె రత్నప్రభాకర్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇమేజ్ కో చైర్మన్ ఇసునూరు అనిల్ చక్రవర్తి, సీకే గరల్స్ హైస్కూల్ ప్రెసిడెంట్ చింతక్రింది కల్యాణ్ కుమార్, సెక్రటరీ వింజమూరి వినయ్ కుమార్, ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయిని వుద్దంటి తనూజ, మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు, సెక్రటరీ అందె మురళీమోహన్, ట్రెజరర్ వడ్లమూడి శ్రీనివాసరావు, అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ వంశీకృష్ణ మాజేటి, సర్వీసు ప్రాజెక్ట్సు డైరెక్టర్ కాపరౌతు సుందరయ్య, పలువురు రొటేరియన్లు పాల్గొన్నారు.