ఐటీ పరిశ్రమల స్థాపన కోసం దేశంలోని టాప్-10 పారిశ్రామికవేత్తలతో చర్చిస్తాం
August 08, 2024
బెంజ్ న్యూస్.తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్ల అభివృద్ధికి చర్యలు చేపట్టండి
ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష
అమరావతిః రాష్ట్రంలో ఐటీ అభివృద్థి, పరిశ్రమల స్థాపన కోసం దేశంలోని టాప్-10 పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నట్లు విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్,ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. పెట్టుబడిదారులను ఆకర్షించడం, మౌలిక సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చించారు. రియల్ టైం గవర్నెన్స్ ను(ఆర్టీజీఎస్) మరింత మెరుగ్గా రూపుదిద్దాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. తిరుపతి, పరిసర ప్రాతాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు విడిభాగాలు తయారుచేసే యూనిట్స్ ను నెలకొల్పేందుకు కృషిచేయాలన్నారు. ఇన్నోవేషన్ సెంటర్స్ లో ప్రోత్సహకాలు అందించి స్టార్టప్ లకు అవసరసమైన ఎకో సిస్టమ్ ను మరింత మెరుగుపరచాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఐటీ సెక్రటరీ సౌరభ్ గౌర్, ఎండీ ఏపీటీఎస్ రమణారెడ్డి, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ డి.వెంకటాచలం, ఐటీ జాయింట్ సెక్రటరీ సూర్జిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.