అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు జిల్లాలో అక్రమ ఇసకాసురు లపై నిన్న ఒక్క రోజునే ఆకస్మిక తనిఖీలను నిర్వహించి ఐదు లారీలు నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని వారిపై వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లుగా వెల్లడించిన జిల్లా ఎస్పీ గారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాదారుల పై జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో వాహన తనిఖీలను చేయుట కొరకు పోలీస్ సిబ్బంది స్పెషల్ టీం లను ఏర్పాటు చేసినట్లు, టాస్క్ ఫోర్సు టీంలను ఏర్పాటు చేసినట్లు 1 లక్కవరం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు చేసి 04 ముద్దాయి లను అరెస్టు చేసి 40 టన్నుల ఇసుక దాని ఖరీదు 16,800/- రూ.లు2 లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని నలుగురు ముద్దాయిలను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 40 టన్నుల వేసుకుని స్వాధీనం చేసుకున్నట్లు దాని ఖరీదు 6000/-.
3.కుక్కునూరు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు చేసి 3 లారీలు ఒక జె.సీ.బి సి స్వాధీనం చేసుకొని నలుగురు ముద్దాయి లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 60 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు దాని ఖరీదు 12,600/-పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి వ్యర్ధాలను రవాణా చేస్తున్న నాలుగు లారీలను స్వాధీనం చేసుకొని నలుగురు ముద్దాయి లను అరెస్టు చేసి కోడి వ్యర్ధాలను ధ్వంసం చేసినారు ఎవరైనా ఇసుకను ఇతర ప్రాంతాలకు లేదా మరి ఏ రాష్ట్రాలకు గాని తరలించాలని ప్రయత్నం చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని కేసును నమోదు చేస్తామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ గారు, ప్రజలు ఇసుక అక్రమ రవాణా గురించి సమాచారమును డయల్ 112 కు గాని పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8332959175 గాని లేదా వాట్సాప్ నెంబర్ 9550351100 మెసేజ్ రూపంలో సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు తెలియ చేసినారు.