లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్రం
July 30, 2024
లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. 2020 ఖరీఫ్ సీజన్ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని నిలిపివేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత కేంద్రం తీసుకున్న చర్యలతో... తిరిగి 2022 ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేశారని తెలిపింది. 2022-23 సీజన్ లో 3.49 లక్షల మంది రైతులకు రూ.563.36 కోట్ల పరిహారం చెల్లించామని కేంద్రం స్పష్టం చేసింది.