నిర్లక్ష్యంగా వాహనాలు నడుపరాదు

 ద్విచక్ర మోటారు వాహనదారులు హెల్మెట్  ధరించి మాత్రమే వాహనం నడపాలి.




అమరావతి లో జరిగిన హెల్మెట్ పై అవగాహన సదస్సు లో మాటడుతున్న పారా లీగల్ వాలంటీర్ మరియు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు జక్కుల లక్ష్మీనారాయణ*మరియు అమరావతి సబ్ ఇన్స్పెక్టర్ సి.హెచ్ .ప్రసాదరెడ్డి...



అతివేగం ప్రమాదకరమని,హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపరాదని,ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని పారా లీగల్ వాలంటీర్ జక్కుల లక్ష్మీనారాయణ  అన్నారు.రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం యొక్క ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి ఆదేశానుసారం  సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార అధికార సంస్థ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి వెంకట నాగ శ్రీనివాసరావు సూచనల మేరకు మోటారు వాహనాల చట్టం గురించి అమరావతి లో బస్ స్టాండ్ దగ్గర,శుక్రవారం సాయంత్రం  న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా జక్కుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్క మోటారు వాహన దారులు రోడ్డు ప్రమాదాలపై  జాగ్రత్తలు పాటించాలని, ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని,లేకపోతే ప్రమాదాల బారిన పడటమే కాక ఒక్కోసారి ప్రాణాలు కూడ పోతున్నాయని హెచ్చరించారు.యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో తలకు ఎక్కువగా గాయం కావడం వల్ల చనిపోతున్నారని అందువల్ల ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు ధరించకపోవడం అది చట్టపరంగా నేరం అని తెలియజేశారు.జులై 1 నుండి దేశంలో క్రొత్త చట్టాలు అమలులోకి వచ్చాయని, అంతేకాకుండామైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని,అలా ఇస్తే వాహన  యజమానులకు, తలిదండ్రులు కూడా శిక్షలు పడే విధంగా నూతన చట్టాలు ఉన్నాయన్నారు.ప్రతి ఒక్క వాహన దారులు విధిగా వారి వాహనము నకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా పొందాలి.సకాలంలో వాహనానికి ఇన్స్యూరెన్స్ చెల్లించాలని ఇంకా పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్యానల్ న్యాయవాది బి. ఎల్.కోటేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో 20 నుండి 30 ఏళ్ల లోపు యువత ఎక్కవ చనిపోవడం జరుగుతుందని,అతి వేగం అత్యంత ప్రమాద కరమని,మైనర్ లకు వాహనాలు ఇవ్వకూడదని,ప్రాణం ఎంతో  విలువైనదని,హెల్మెట్ రక్షణ కవచం అని,రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం మూలంగా జరుగుతునాయని,నిదానమే ప్రదానమని, రోడ్డు భద్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెల్మెట్ వల్ల ఉపయోగం మండల న్యాయ సేవ సాధికార సంస్థ వల్ల ప్రజలు కలిగే ఉపయోగాలు గురించి వివరించారు.అమరావతి సబ్ ఇన్స్పెక్టర్ సి. హెచ్.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపరాదని,లైసెన్సు లేకుండా  వాహనాలు నడుపరాదని,వాహనాలకు ఇన్స్యూరెన్సు అవసరమని,ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాది బి.ఎల్. కోటేశ్వరరావు  పారా లీగల్ వాలంటీర్ జక్కుల లక్ష్మీనారాయణ మరియు అమరావతి సబ్ ఇన్స్పెక్టర్ సి. హెచ్.ప్రసాదరెడ్డి, ఇతర పోలీస్ సిబ్బందిమరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.