75 త్యాళ్ళూరు హైస్కూల్ అభివృద్ధికి "విభ" ఫౌండేషన్ 25116 విరాళం.


 పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఆ పాఠశాల పూర్వ విద్యార్ధి మరియు "విభ" ఫౌండేషన్ అధినేత 

బి.నరసింహ రావు, 25116రూల విరాళంను పాఠశాలలో జరుగుతున్న ఐరన్ మెస్ గ్రిల్లింగ్ నిమిత్తం శనివారం హెచ్.ఎంకు అందజేశారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి తమ ఫౌండేషన్ సహాకారం ఉంటుందని నరసింహ రావు అన్నారు.పాఠశాల అభివృద్ధికి విభ" ఫౌండేషన్ సహకారం అభినందనీయమని, పాఠశాలలో అభివృద్ధికి పూర్వ విద్యార్ధులు ముందుకు రావాలని ప్రధానోపాధ్యాయులు  అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో  కె.వి.సుబ్బారావు,పిసి చైర్మన్ జీ.శ్రీనివాసరెడ్డి,పూర్వ విద్యార్థులు గణేష్,

బి.తిరుపతయ్య,రాంబాబు, నాగరాజు,జయరాజు 

ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దాతకు పాఠశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేశారు.