ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు గారి స్వగ్రామం లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు గ్రామానికి విచ్చేసిన చీఫ్ విప్ జీవీ గారికి గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. భోగ భాగ్యాల భోగి పండుగ రోజు గ్రామంలోని భావన్నారాయణ స్వామి దేవాలయం, శివాలయంలో జరిగిన ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. భోగి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, భోగభాగ్యాలు నింపాలని కోరుకుంటూ భగవంతున్ని ప్రార్థించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.
ఇనిమెళ్ళలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ.
January 14, 2026

