గ్రామ యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు వాలీబాల్ టోర్నమెంట్
రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పిఎస్కే మస్తాన్ షరీఫ్
మండల పార్టీ అధ్యక్షుడు అక్కల వెంకటరామిరెడ్డి
బెల్లం కొండ జనవరి 14(అక్షర కృష్ణ ):గ్రామ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో సంక్రాంతి పండుగ సందర్భంగా బుధవార బెల్లంకొండ జిల్లా పరిషత్ హై స్కూల్లో వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు. క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌కు పరిసర గ్రామాల నుంచి అనేక జట్లు పాల్గొనడం విశేషం.టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పి ఎస్ కే మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ, యువత క్రీడలపై ఆసక్తి చూపడం ఎంతో ఆనందకరమని అన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో ముఖ్యమని, ఇలాంటి పోటీలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు అక్కల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూప్రారంభ మ్యాచ్ ఉత్సాహంగా సాగగా, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు. టోర్నమెంట్ చివరలో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభానికి చేసిన ముఖ్య నాయకులు ఇరు జట్లు ను పరిచయం చేసుకొని అనంతరం ప్రారంభించారు.
ఈ టోర్నమెంట్ కి మొదటి
బహుమతి:
రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి psk. మస్తాన్ షరీఫ్ బెల్లంకొండ గ్రామ సర్పంచ్ గడ్డిపర్తి సముద్రం
రెండవ :
బహుమతి బెల్లంకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు తోట రమాదేవి
మూడవ:
బహుమతి తాపీ మేస్త్రి
తురక వీరయ్య
బహుమతులు అందజేయనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీలలో ప్రతి ఒక్కరు పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ గ్రామ సర్పంచ్ గడ్డిపర్తి సముద్రం. మండల ప్రధాన కార్యదర్శి తమ్మిశెట్టి సత్యనారాయణ. గ్రామ వైస్ ప్రెసిడెంట్ కొండవీటి అబ్దుల్ రజాక్. సయ్యద్ అబ్దుల్ నవాబ్ జానీ. మాజీ తెలుగు యువత సయ్యద్ అబ్దుల్ చెప్పారు. గ్రామ పెద్దలు క్రీడాకారులు పాల్గొన్నారు.


