నరసరావుపేట అక్టోబర్ 21(అక్షర కృష్ణ):*పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూప్రభుత్వ ఉద్యోగుల న్యాయ పరమైన డిమాండ్ లను పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.త్వరలో ఆర్టీసీ ఉద్యోగులు, మిగిలిన వారి సమస్యలు పరిష్కరించాలని సంకల్పంతో ముందుకు వెళుతున్నారనీ, ఇప్పటికైనా వైసీపీ నేతలు అవాకులు,చవాకులు పేల్చడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాo అన్నారు.కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి స్వేచ్ఛగా పని చేస్తున్నారనీ, రాష్ట్రం పూర్తిగా లోటు బడ్జెట్ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక తలంపుతో ముందుకు వెళుతున్నారన్నారు.మా ప్రభుత్వ పాలనలో ఎక్కడా ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినవు,విధుల్లో నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకుంటారన్నారు.నవంబర్ 1 నుండి ఒక డీఏ ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించటం, ఉద్యోగు సంఘాల నాయకులు వారి విధులకు ఆటంకం లేకుండా చూస్తారన్నారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారనీ, ప్రభుత్వ ఉద్యోగులే రాష్ట్ర అభివృద్ధికి రద చక్రాలు అనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ భావన అని తెలిపారు.రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడి ఉన్నా ఉద్యోగుల బాగోగులే మా నాయకుడు చంద్రబాబుకి ముక్యం అని అన్నారు.