దళిత సంఘాలపై ప్రతిపాడు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : మాల మహానాడు*

పల్నాడు జిల్లా స్థానిక నరసరావుపేట పట్టణ కేంద్రంలోని మాల మహానాడు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన సమావేశంలో *పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ గోదా బాల* మాట్లాడుతూ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తురకపాలెం గ్రామంలో కలుషిత నీరు త్రాగి సుమారు 28 మంది మాలలు మరణిస్తే మరణించిన బాధితులను జగన్ మద్యం తాగి చనిపోయారని ఎయిడ్స్ రోగంతో చనిపోయారని వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడి వారిని ఒక పార్టీ కార్యకర్తలుగా ముద్ర వేసి వారికి ఎటువంటి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించకుండా ప్రయత్నం చేసినప్పుడు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బాధితులు మరియు దళిత సంఘాలను వెంటబెట్టుకొని గుంటూరు ఎంపీ పెమ్మ సాని చంద్రశేఖర్ దృష్టికి అలాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితుల అకౌంట్లో డబ్బులు పడటానికి కారణమైనారని తెలియజేశారు.., అనంతరం *మాల మహానాడు నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ వుస్తెల జయరావు మాట్లాడుతూ స్థానిక ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి బూర్ల రామాంజనేయులు గారు అంబేద్కర్ భిక్షతోనే మీరు శాసనసభ్యుడు అయ్యారని గుర్తుంచుకోవాలి, గతంలో మీరు IAS గా పనిచేసినప్పటికీ నేడు రాజకీయలలో ప్రఖ్యాత గాంచిన మీరు, తోటి దళిత నాయకులను అవమానపరిచే విధంగా దళారులుగా అనటం కరెక్ట్ కాదని తెలియజేస్తూ.., ప్రభుత్వనాకి తురకపాలెం బాధితులపై తప్పుడు సమాచారం ఇచ్చి వారికి ఎటువంటి సహాయం అందనివ్వకుండా శాసనసభ్యులు చూసినప్పుడు దళిత సంఘాలు బాధితుల వెంట ఉండి వారికి న్యాయం చేస్తే సంఘాలను ఉద్దేశించి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో తప్పుడు వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమని కారంచేడు చుండూరు లాంటి ఘటనలపై దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిలబడ్డాయే తప్ప అధికారులు ప్రభుత్వం నిలబడలేదని గుర్తు ఎరగాలని అటువంటి *సంఘాలను తక్కువ చేసి* మాట్లాడటం వెనక తురకపాలెం బాధితులను అణచివేసే కుట్ర నడుస్తుందని ఇప్పుడు ఎమ్మెల్యేకి మద్దతుగా మాట్లాడుతున్న కొన్ని సంఘాలు గోళ్ళ అరుణ్ కుమార్ పై  మాట్లాడుతున్న భాష మార్చుకోకపోతే సమాజంలో విలువలు కోల్పోతారని ఏ సంఘమైన సమస్యపై వెళ్ళినప్పుడు ముందుగా స్పందించే అధికారులు ప్రభుత్వాలు చాలా తక్కువగా ఉంటాయని సంఘాలు గుర్తించాలని నిరంతర పోరాటాల వల్లే ఏ సమస్య అయిన పరిష్కారం సంఘ నాయకులు పోరాటం వల్లే జరుగుతుందని తెలుసుకొని బేషరతుగా ఎమ్మెల్యే దళిత సంఘాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .సమావేశంలో నరసరావుపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సేవా సామేలు, గోల నీలంబరం, కొండ ప్రకాష్ తదితరులు ఉన్నారు.